TEJA NEWS TV (గిద్దలూరు )
తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు రాచర్ల మండలం, అనుమలపల్లె గ్రామంలో గిద్దలూరు టీడీపీ ఇంచార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి 21వ రోజు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం చేపట్టారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన రచ్చబండలో అశోక్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థిక మాంద్యంతో కుదేలవుతోందని, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే ఆర్థిక కష్టాలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చునన్నారు. రాష్ట్రాన్ని అప్పుల మయంగా మార్చేసి ప్రతి ఒక్కరి నెత్తిమీద అప్పుల మూటను పెట్టిన ఘనత జగన్ రెడ్డికే దక్కుతుందన్నారు. అన్ని వర్గాల ప్రజలు చీదరించుకునే స్థాయికి ప్రభుత్వం దిగజారిపోయిందన్నారు. టిడిపి విజయానికి విజయకేతనం ఎగరవేస్తూ ప్రజలందరూ ఏకమై వైసీపీని తరిమికొడుతూ జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలన్నారు. నాడు తెలుగుదేశం హయాంలో రాష్ట్రంలోని అన్నీ వర్గాల ప్రజల సంక్షేమం కోసం నారా చంద్రబాబు నాయుడు గారు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేద ప్రజలకు భరోసా నిచ్చారని, దేశ చరిత్రలో కార్యకర్తలకు భరోసాగా నిలిచిన పార్టీ తెలుగుదేశం అని, చంద్రన్న భీమాతో పేదలకు తెలుగుదేశం అండగా నిలిచిందని ప్రజలకు గుర్తు చేశారు. మళ్ళీ అలాంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలంటే తెలుగుదేశం అధికారంలోకి రావాలని, రోబోవు ఎన్నికల్లో తెలుగుదేశం విజయకేతనం ఎగరడం ఖాయం అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ నాయకులు అభిమానులు భారీగా పాల్గోన్నారు.