Monday, January 12, 2026

గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం ప్రారంభం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

తేజ న్యూస్ టీవీ



చండ్రుగొండ, 15 అక్టోబర్ 2025:

గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం ఈరోజు నుండి ప్రారంభమైంది. ఈ కార్యక్రమం నవంబర్ 15 వ తారీఖు వరకు కొనసాగనుంది. ప్రారంభ దశలో భాగంగా ఈరోజు చండ్రుగొండ లో పశువులకు టీకాలు వేసిన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

మండల పశు వైద్యాధికారి డాక్టర్ వి. సంతోష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, నాలుగు నెలలు నిండిన ఆవు మరియు గేదె జాతి పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలంటూ రైతులకు సూచించారు. వ్యాధి సోకకుండా ఉండేందుకు ప్రతి పశువుకూ ఈ టీకా అత్యంత అవసరమని ఆయన చెప్పారు.

రైతులు సమయానికి టీకాలు వేయించుకోవాలని, టీకాలు ఉచితంగా ఇవ్వబడుతున్నాయని పశుసంవర్ధక శాఖ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్. వి. సంతోష్, ఎండి సలీం, ఎల్ ఎస్ ఏ, ఈశ్వరయ్య ఓ.ఎస్, భీముడు ఓ.ఎస్ గోపాల మిత్రాలు శ్రీనివాస్, నరేష్, వెంకట దాసు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular