పరకాల నియోజకవర్గం సంగెం మండలం గవిచర్ల గ్రామం లో రాజ్యంగ పరిరక్షణ లో భాగంగా జై బాపు,జై భీమ్,జై సంవిధాన్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో మరియు అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పరిరక్షించు కోవాలంటూ జై బాపు, జై భీమ్, జై సంవీదాన్ పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రకు ముఖ్య అతిథిలుగా *వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ * పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడుతూ…కేంద్రం లో ఉన్న బిజేపి పార్టీ డాక్టర్. బి ఆర్ అంబేద్కర్ ని అవమానిస్తూ, రాజ్యాంగాన్ని కించపరిచేలా బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌లు ఏవిధంగా వ్యవహరిస్తున్నాయో ప్రజలకు తెలియజేస్తామన్నారు. పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగాన్ని బీజేపీ పార్టీ అనగదొక్కాలని చూస్తుందన్నారు. అమిత్ షా , అంబేడ్కర్ ని పార్లమెంట్ సాక్షిగా అవమానించారన్నారు. అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలు దేశ సమాజం క్షమిందని, జై బాపు, జై భీమ్, జై సంవిదాన్ నినాదాన్ని క్షేత్ర స్థాయిలో బలంగా తీసుకెళ్లాలని అన్నారు.
ఈ కార్యక్రమం లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్లేటి మాధవరెడ్డి, మండల కోఆర్డినేటర్ మాసాని యాకుబ్, జిల్లా అధికార ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మెట్పల్లి రమేష్, మాజీ జెడ్పిటిసి వీరమ్మ, మాజీ ఎంపీపీ కళావతి, సమన్వయ కమిటీ సభ్యులు నరహరి,కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాష్పాక యాకుబ్, భాష్పాక సదయ్య, మండల ప్రధాన కార్యదర్శి కొల్లూరి రాజు, కిషోర్, కుమార్, ఎండి పాషా, జగన్నాథ చారి, చంద్రశేఖర్ గ్రామ యూత్ అధ్యక్షులు సతీష్, గాలి రాజు, నల్గొండ భాస్కర్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ నాయకులు మహిళా కార్యకర్తలు యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
గవిచర్ల గ్రామంలో ఘనంగా జై బాపు, జై బీమ్, జై సంవిధాన్, కార్యక్రమం
RELATED ARTICLES