తేజ న్యూస్ టివి ప్రతినిధి
నిజాంబాద్ జిల్లా ఆర్మూర్ లో తోలు పరిశ్రమ కమిటీ సభ్యులు కొక్కెర భూమన్న ఆధ్వర్యంలో మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు సునీల్ అధ్యక్షతన ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ ఆర్మూర్ తోలు పరిశ్రమ కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ
ఆర్మూర్ మండల కేంద్రంలో తోలు పరిశ్రమను గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇక్కడ మరుగున పడ్డ కుట్టుమిషన్లు మరియు బూట్లు మరియు బెల్టు మరియు బ్యాగులకు సంబంధించిన మెటీరియల్స్ పనికిరాకుండా పోతున్నాయి తోలు పరిశ్రమ అంటే ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ యువతి యువకులకు ప్రోత్సాహాన్ని ఇస్తూ ఎన్నో కుటుంబాలను ఆదుకునే దిశగా ఉండే ఈ తోలు పరిశ్రమను గత ప్రభుత్వం కేసీఆర్ ఈ తోలు పరిశ్రమను కనుమరుగైపోయేలా, మాదిగలను చిన్నచూపు చూశారు మాదిగలను అణచివేసే దిశగా గత ప్రభుత్వం చేసింది అనడానికి ఇది ఒక నిదర్శనం తోలు పరిశ్రమ అంటేనే ఎన్నో వేల కుటుంబాలకు చేయూత నిచ్చే పరిశ్రమగా చెప్పుకోవచ్చు కానీ గత ప్రభుత్వం యువకులకు చెడు వ్యసనాలకు బానిస అయ్యేలాగా చేసింది కేసీఆర్ అని చెప్పుకొచ్చారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో తోలు పరిశ్రమలను రీఓపెనింగ్ చేయించి యువతీ యువకులకు ఉపాధి కల్పించే విధంగా మేము కృషి చేస్తూ స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు స్థానిక మంత్రులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి ఈ విషయంపై పూర్తిస్థాయిలో నివేదిక సమర్పించి పరిశ్రమను ప్రారంభించే దిశగా ముఖ్యమంత్రి మీద పూర్తి నమ్మకం ఉందని రామకృష్ణ తెలియజేశారు పాల్గొన్న నాయకులు ప్రవీణ్ భవాని రెడ్డి దుర్గారాజ్ గోపి గంగాధర్ శివ భీమదేవరపల్లి ఎస్సీ డిపార్ట్మెంట్ మండల అధ్యక్షులు తాళ్లపల్లి కిరణ్, తదితరులు పాల్గొన్నారు
గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆర్మూర్ తోలు పరిశ్రమ మరుగున పడ్డది:డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ
RELATED ARTICLES