భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
14-12-2024
చండ్రుగొండ మండల కేంద్రంలో రైతులకు ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం కోసం ఎమ్మెల్యే జారే ఇచ్చిన హామీలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జితేష్ వి పాటిల్ కలెక్టర్ ను గండుగులపల్లిలో చండ్రుగొండ మండల కాంగ్రెస్ నాయకులు కలిసి రైతుల సమస్యలను వివరించారు. వెంటనే కలెక్టర్ స్పందించి సోమవారం నుండి మార్కెట్ యార్డ్ నందు కొనుగోలు కేంద్రం ప్రారంభించవలసిందిగా ఆదేశాలు ఇచ్చినారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన చండ్రుగొండ మండల రైతులు ఈ కార్యక్రమంలో సీనియర్ మండల నాయకులు బొజ్జ నాయక్, మండల అధ్యక్షులు గోవిందరెడ్డి ,బొర్రా సురేష్, రాములు నాయక్, తదితరులు పాల్గొన్నారు.
గండుగుల పల్లిలో కలెక్టర్ ను కలిసిన చండ్రుగొండ మండల కాంగ్రెస్ నాయకులు… ఫలించిన మండల కాంగ్రెస్ నాయకుల ప్రయత్నం
RELATED ARTICLES