దమ్మపేట మండలం గండుగులపల్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ గ్రౌండ్లో 27 వ తారీఖున ఖమ్మం, నల్గొండ, వరంగల్, జిల్లాల ఎమ్మెల్సీ పట్టభద్రుల ఉప ఎన్నికల సందర్భంగా అశ్వరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారే ఆదినారాయణ మాట్లాడుతూ తీన్మార్ మల్లన్న ప్రజలకు మేలు చేయాలని తపన మల్లన్న లో కనిపిస్తుందని ఏదైనా విషయాన్ని ప్రజలకు తెలియజేయడంలో దిట్ట అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిద్దాం అని శాసనసభ్యులు జారే ఆదినారాయణ అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఖమ్మం పార్లమెంటు అభ్యర్థి రామ సహాయం రఘురాంరెడ్డి శాసనసభ్యులు జారీ ఆదినారాయణ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు సిపిఎం, సిపిఐ, పార్టీల ముఖ్య నాయకులు ఐదు మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు వివిధ హోదాలలో ఉన్న ప్రజాప్రతినిధులు అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
గండుగలపల్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ గ్రౌండ్లో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నహాక సమావేశం
RELATED ARTICLES