సంగెం మండలం నార్లవాయి గ్రామంలో బుధవారం రోజు జాగృతి పోలీస్ కళా బృందంతో వరంగల్ నగర పొలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపీఎస్, ఆదేశాల మేరకు రాత్రి 7:30 గంటల నుండి రాత్రి 10:00 గంటల వరకు సంగెం పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో చదువు,రోడ్డు ప్రమాదాలు, డయల్100, బాల్య వివాహాలు, బాలకార్మికులు, సిసి కెమేరాలు,మరియు గుట్క,గంజాయి డ్రగ్స్ వల్ల యువకులు వారి జీవితాలను నాశనం చేసుకోవద్దని,,ముసలి తల్లి తండ్రులను మంచిగ చూసుకోవాలని, వారికి కావాల్సింది ఒక్కటే వాళ్ళ ఆశయాలను నెరవేర్చాలని మంచిగా చదువుకొని మంచి విద్యావంతులు కావాలన్నదే తల్లిదండ్రుల కోరిక అని అన్నారు నకిలి విత్తనాలు ఎవరు కొనవద్దని ఎవరైన డీలర్ వద్ద కొంటే కచ్చితంగా రశీదు తీసుకోవాలని,తదితర అంశాలపై పాటల ద్వార, మరియు సైబర్ క్రైమ్స్ నాటిక ద్వార ప్రదర్శిస్తు1930 సైబర్ టోల్ నంబర్ గురించి వివరించారు.
ఈ కార్యక్రమానికి మామునూరు ఏసిపి , పర్వతగిరి సిఐ , శ్రీనివాస్ సంగెం,ఎస్ఐ, నరేష్, ఏఎస్ఐ సీతారాములు, మరియు పోలీస్ బృందం, ఆఫీసర్స్,కళాబృందం ఇంచార్జి ఉమెన్ ఏఎస్ఐ శ్రీమతి నాగమణి , హెచ్ సి పిసి రత్నయ్య హెచ్ జి ఎస్, శ్రీనివాస్, విక్రమ్రాజు, చిరంజివి మరియు గ్రామ ప్రజలు మొత్తం 400 మంది,పాల్గొన్నారు.
గంజాయి డ్రగ్స్ గుట్కా ల వల్ల యువకులు మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు
RELATED ARTICLES