భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
బెంగుళూరు, సోమవారం (తేదీ):
ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను సోమవారం సాయంత్రం బెంగుళూరులో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి పరామర్శించారు.
ఇటీవల ఖర్గే గారికి వైద్యులు ఫేస్ మేకర్‌ను విజయవంతంగా అమర్చిన విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితిపై తమ ఆందోళన వ్యక్తం చేసిన నేతలు, త్వరితగతిన కోలుకోవాలని ఆకాంక్షించారు. ఖర్గే కుటుంబ సభ్యులతో సైతం వారు మాట్లాడారు.
ఈ సందర్బంగా పార్టీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వహణ, కేంద్ర రాజకీయాలపై సైతం చర్చించారని సమాచారం.
ఖర్గేను పరామర్శించిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొన్నం, శ్రీహరి
RELATED ARTICLES



