TEJA NEWS TV
గౌరవనీయులు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారితో , తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు శనివారం రాత్రి భేటీ అయ్యారు. తెదేపా , జనసేన పార్టీల శ్రేణుల మధ్య, క్షేత్రస్థాయిలో సమన్వయo, ప్రజల ఆదరాభిమానాలు నిలబెట్టుకోవడానికి చేయాల్సిన పనులు, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్ని, నేతలు చర్చించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రెండు పార్టీల నేతలు వ్యవహరించాలని నిర్ణయించారు.
జన సైనికులు చూపించిన రణోత్సహం ,తెదేపా శ్రేణుల సమిష్టి కృషి , భాజపా అభిమానుల ఆదరణ మొత్తంగా, ఓటర్ల తీర్పులో ప్రతిబింబించాయని శ్రీ పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించారు . ఇంతటి భారీ విజయాన్ని కట్టబెట్టిన ప్రజా తీర్పునకు అనుగుణంగా దశాబ్దం పాటు ఈ మైత్రి కొనసాగాలని శ్రీ పల్లా శ్రీనివాస్ రావు గారు అభిలషించారు.ఆ మేరకు కార్యాచరణను నేతలు నిరంతరం పర్యవేక్షించాలని, ఎక్కడైనా భేదాభిప్రాయాలు తలెత్తుతున్నాయని సూచనలు కనిపిస్తే ,తక్షణం వాటిని సరిదిద్దేలా మార్గదర్శకాలు ఇవ్వాలని నిర్ణయించారు. గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాలను ప్రజలు మరింత అవగతం చేసుకునేలా సుపరిపాలన అందించాలని ఇద్దరు నేతలు అభిప్రాయపడ్డారు.