TEJA NEWS TV
కోసిగి మండల కేంద్రంలో పలు ఎరువుల దుకాణాలలో రికార్డులను మరియు ఎరువుల గోడన్లను మండల వ్యవసాయ అధికారి ఏం.వరప్రసాద్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.మంగళవారం తనిఖీలో భాగంగా కోసిగి మండల పరిధిలోని శ్రీ మంజునాథ ట్రేడర్స్, గిరిజా ట్రేడర్స్ , శ్రీ వాసవి ఫర్టిలైజర్స్ , హనుమాన్ ఫర్టిలైజర్స్, ఓం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఫర్టిలైజర్స్ ,శ్రీ లక్ష్మీనరసింహస్వామి ట్రేడర్స్ వారు నిర్వహించే దుకాణాలు మరియు గోదాములను తనిఖీ చేయడం జరిగింది . మండల వ్యవసాయ అధికారి M. వరప్రసాద్ మాట్లాడుతూ మండలంలో ఎక్కడైనా గోదాములలో యూరియా నిల్వ ఉంచి రైతులకు అందుబాటులోకి తీసుకురాకుండా ఉన్నట్లయితే వారిపై చర్యలు తీసుకుంటామని అలాగే ఎవరైనా ఎమ్మార్పీ కి మించి యూరియా అమ్మినట్లయితే వారి లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. తనిఖీల్లో భాగంగా ఎరువుల దుకాణాలు వారు నిర్వహించే రిజిస్టర్లు మరియు బిల్లు బుక్కులు తనిఖీ చేయడం జరిగింది . ఎరువుల దుకాణానికి వచ్చినటువంటి రైతులకు సాగు విస్తీర్ణాన్ని బట్టి ఒక రైతుకు రెండు నుంచి మూడు సంచులు మించకుండా యూరియా అందించాలని, ఎరువులు కొన్న రైతులు పక్క రాష్ట్రాలకు తరలించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు . ఎరువులు కొన్న రైతులకు తప్పకుండా రసీదు అందించాలని అలాగే డి బి టి మిషన్ నందు ఎరువుల కొనుగోలు నమోదు చేయాలని తెలిపారు. రైతులు కూడా యూరియా వినియోగం నందు అవగాహన పెంపొందించుకోవాలని అవసరానికి మించిన ఎరువులు వాడటం వలన నేల నిస్సారం అవ్వడమే కాకుండా పెట్టుబడి ఖర్చు కూడా పెరుగుతుందని తెలిపారు.
ఈ తనిఖీలో మండల వ్యవసాయ అధికారి ఎం వరప్రసాద్ తోపాటు ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ కార్తీక్ సాగర్ మరియు ఏఎస్ఐ తిరుపాల్ నాయక్ పాల్గొన్నారు
కోసిగి లో ఎరువుల దుకాణాలపై ఆకస్మిక తనిఖీ నిర్వహించిన మండల వ్యవసాయ అధికారి
RELATED ARTICLES