కర్నూలు జిల్లా కోసిగి మండలంలో 15వ జాతీయ ఓటర్ దినోత్సవ సందర్భంగా మండల ఎమ్మార్వో రుద్ర గౌడ్ ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది, హై స్కూల్ విద్యార్థులతో కలిసి మండల కేంద్రమైన కోసిలో ర్యాలీ నిర్వహిస్తూ అవగాహన చేశారు. ఈ ర్యాలీలో భాగంగా కోసిగి వైయస్సార్ సర్కిల్ నందు మానవహారంగా ఏర్పడి విద్యార్థుల చేత అధికారుల చేత ప్రతిజ్ఞ చేయించారు. 2011 వ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదీని ప్రభుత్వం జాతీయ ఓటర్ల దినోత్సవం గా ప్రకటించిందని, ఓటు విలువ ప్రతి ఒక్కరు తెలుసుకొని ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడానికి ఈ జాతీయ ఓటర్ దినోత్సవం జరుపుకుంటామని, ఓటు అనేది స్వేచ్ఛయుతమైన వాతావరణంలో, ఎటువంటి భయం గాని, కుల,మత, జాతి పక్షపాతం చూపకుండా, డబ్బు ప్రలోభాలకు లొంగకుండా మనస్సాక్షి ప్రకారం ఓటు వేయాలని, మనం వేసే ఓటే మన భవిష్యత్తు మార్చే ప్రధాన ఆయుధమని ,స్వేచ్ఛగా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయడం గలిగితే భవిష్యత్ తరాలకు మంచి ప్రభుత్వాలను లంచాలు లేని దేశాన్ని భవిష్యత్ తరాలకు అందించిన వారమవుతామని, ఈ సందర్భంగా ఎమ్మార్వో రుద్ర గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ అధికారులు హై స్కూల్ పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
కోసిగిలో జాతీయ ఓటర్ దినోత్సవం పై అవగాహన సదస్సు
RELATED ARTICLES