TEJA NEWS TV :
కర్నూలు జిల్లా కోసిగి మండలం లో వెలసిన పరమ పూజ్య శ్రీ మదబినవ శివపుత్ర మహా స్వాములవారి 7వ జయంతోత్సవం 3 రోజులపాటు జ్ఞాన దాసోహ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్ణాటక రాష్ట్రం బీజాపూర్, హుబ్బళ్లి,
మఠం పీఠాధిపతులు, శ్రీ అభినవ సిద్దారుడ స్వాములవారు హాజరయ సిద్ధరూఢ స్వామి వారికి జలభిషేకం,ఫల పుష్ప అలంకరణ, మహా మంగళారతులు, వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పరమ పూజ్యాలు ఆబినవ సిద్ధా రూడ స్వామి ప్రవచనాలు అందరి అలోచనలు ,హృదయాలు సైతం , కదలించే విధంగా ఉన్నాయని భక్తులు చర్చించుకున్నారు.
అత్యంత ప్రీతి పాత్రుడై గురుభక్తిని నమ్మి సిద్ధారుడ స్వామి శిష్యుడైన అరికేరి వీరారాజు పరమ పూజ్యలు శ్రీ అభినవ సిద్ధారుడా స్వాముల వారికి కుటుంబ సమేతంగా పాదపూజ నిర్వహించి గురువుల అనుగ్రహం పొందారు.
సాయంత్రం కాలం వేల భక్తుల మధ్య శ్రీ సద్గురు సిద్ధారుడా స్వాముల వారి పల్లకోత్సవం పురవీధులలో ఊరేగించారు.
కోలాటాలు ఆటలు పలువురుని ఆకట్టుకున్నాయి,ఆంధ్ర కర్ణాటక ,తదితర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులకు భోజన సదుపాయం చేశారు
ఈ కార్యక్రమంలో కరిబసవ రాజేంద్ర మహా స్వాములు, హుబ్బళ్లి సిద్ధరూడ స్వామి శిష్యులు పాల్గొన్నారు.