TEJA NEWS TV (కర్నూలు జిల్లా )
జనరంజక పాలన… జగనన్న పాలన.మేజర్ గ్రామ పంచాయతీ కోసిగిలో రెండోరోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం.మేజర్ గ్రామ సర్పంచ్ కుమారి అయ్యమ్మ,మండల ఇంచార్జీ మురళీమోహన్ రెడ్డితో కలిసి ప్రతి గడపకు కలియతిరిగిన ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి..ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సమయంలో ప్రజల సూచనలు,అభిప్రాయాల మేరకే నవరత్నాల ద్వారా జగనన్న జనరంజక పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రము కోసిగిలోని 3వ సచివాలయం నందు సర్పంచ్ కుమారి అయ్యమ్మ,మండల ఇంచార్జీ మురళీమోహన్ రెడ్డితో కలిసి రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి పాల్గొన్నారు.ప్రతి గడపకు వెళ్లి అక్క,చెల్లి,అన్న,తమ్ముడు, అవ్వ,తాత అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ, జగనన్న సంక్షేమ పథకాల గురించి అడుగుతూ,పార్టీలకు అతీతంగా అర్హులైన లబ్దిదారులు చిరునవ్వుతో చెప్పుతుంటే,ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి మాట్లాడుతూ, మా ప్రభుత్వంలో ఏవైనా పనులు కావాలంటే అడగండి, చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు,అభిమానులు శాలువా కప్పి పూలమాలలతో సత్కరించారు.ఈకార్యక్రమంలో తాహాశీల్దార్ రుద్రగౌడ్, యంపీడీఓ రాజేంద్ర ప్రసాద్, పీఆర్ ఏఈ యుగంధర్ రెడ్డి, హౌసింగ్ ఏఈ షేక్షావలీ, యంపీపీ ఈరన్న,నాడిగేని నరసింహులు,బెట్టనగౌడ్, మహంతేష్ స్వామి,ఐరనగల్లు శ్రీనివాసరెడ్డి,యన్ నాగరాజు, జగదీష్ స్వామి,మాణిక్యరాజు, మాజీ యంపీపీ బీమక్క,మాజీ జడ్పీటీసీ మంగమ్మ,ఉరుకుంద ఈరన్న స్వామి దేవస్థానం బోర్డు సభ్యులు బుళ్ళి నరసింహులు,కోసిగయ్య, కాంట్రాక్ట్ బసిరెడ్డి,దొడ్డి నర్సన్న,ఏపీఓ జయరాం, ఏపీయం సత్యమ్మ, సూపర్వైజర్లు సుధారాణి, సురేఖ మరియు అన్ని శాఖల అధికారులు,సచివాలయ సిబ్బంది,కన్వీనర్లు,వాలింటర్లు తదితరులు పాల్గొన్నారు.