భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ఏసీబీ అధికారులు మెరుపు దాడి నిర్వహించారు. లంచం తీసుకుంటూ అటవీ శాఖకు చెందిన ఇద్దరు ఉన్నతాధికారులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
టీ ఎఫ్ డి సి (TFDC) ప్లాంటేషన్ మేనేజర్, ఫారెస్ట్ రేంజ్ అధికారి తాడి రాజేందర్‌తో పాటు ఆయన పై అధికారి, ఫారెస్ట్ డివిజనల్ మేనేజర్ తాటి శ్రావణిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. జామయిల్ కట్ చేసిన బిల్లులను చెల్లించేందుకు కాంట్రాక్టర్ వద్ద నుంచి లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
సమాచారం ప్రకారం, మొత్తం 32 వేల టన్నుల జామయిల్ కటింగ్‌కు సంబంధించిన బిల్లుల క్లియరెన్స్ కోసం టన్నుకు రూ.150 లంచం డిమాండ్ చేయగా, చివరకు టన్నుకు రూ.90కు బేరం కుదిరింది. ప్రభుత్వ పరంగా టన్నుకు రూ.750 చెల్లింపు ఉండగా, అదనంగా లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.
మొదటి యూనిట్‌లో 3,900 టన్నుల కటింగ్‌కు సంబంధించిన బిల్లులు చేయడానికి రూ.3 లక్షల 51 వేల లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ నేతృత్వంలోని బృందం దాడి చేసి వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది.
ఈ ఘటనతో అటవీ శాఖలో కలకలం రేగింది. కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
కొత్తగూడెం: ఏసీబీ దాడి – ఫారెస్ట్ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత
RELATED ARTICLES



