భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
కొత్తగూడెం:
చండ్రుగొండ స్థానిక పంచాయతీ కార్యాలయంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో రైల్వే సాధన కమిటీ చైర్మన్ పాండురంగ చార్యులు, మాట్లాడుతూ గతంలో కొవ్వూరు రైల్వే లైన ఉద్యమం తోనే మంజూరు చేయించుకున్నామన్నారు. అదేవిధంగా కొత్తగూడెం నుండి కొండపల్లి వరకు ప్రయాణికులు ప్రయాణించే రైలును మంజూరు చేయాలని కేంద్ర పై ఒత్తిడి చేయాలని అన్నారు. గిరిజన గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ప్యాసింజర్ రైలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడంలో కృషిచేసిన చైర్మన్ కొదమ సింహం పాండురంగ చార్యులు ను అఖిలపక్ష నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి కొనగళ్ళ వెంకటరెడ్డి, ధారా బాబు, తుమ్మలపల్లి సురేష్, నల్లమోతు రఘుపతి, భోగి కృష్ణ, ఎస్కే ఉమర్, హరిబాబు తదితరులు పాల్గొన్నారు.
కొండపల్లి రైల్వే లైన్ కోసం పోరాడుదాం…రైల్వే లైన్ సాధన కమిటీ చైర్మన్ కొదమ సింహం పాండురంగ చార్యులు
RELATED ARTICLES