


TEJA NEWS TV: ఆళ్లగడ్డలో శిల్పా వెంచర్ నిర్వాహకులు కేసీ కెనాల్ కాలువ భూములపై అక్రమంగా వెంచర్లు మరియు భవన నిర్మాణాలు చేపట్టినట్లు ఆరోపిస్తూ, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కర్నూల్ జిల్లా పరిషత్ సమావేశంలో మాట్లాడిన ఆమె – ఈ అక్రమ నిర్మాణాల వల్ల 7 ఎకరాల భూములకు నీరు వెళ్లడం ఆగిపోయిందని, రైతులకి నష్టమైతుందని పేర్కొన్నారు.
ఈ విషయంపై అసెంబ్లీలోనూ చర్చ జరిగిందనీ, హైకోర్టు నుండి ఆదేశాలు తీసుకురావడం జరిగిందని తెలిపారు.
శాసనసభలో గళమెత్తిన అఖిలప్రియ, అక్రమ వెంచర్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేశారు.