భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
04- 12- 2025
సుజాతనగర్
రాఘవపురం
సుజాతనగర్ మండలం రాఘవపురం గ్రామపంచాయతీ ఎన్నికలకు కూటమి తరఫున (CPI–CPM–BJP–TRS మద్దతుతో) సర్పంచ్ అభ్యర్థిగా ముకరి ఉషరాణి గురువారం నామినేషన్ దాఖలు చేశారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె, “ప్రభుత్వం మహిళలకు వాగ్దానం చేసిన రూ.2500 ఇవ్వలేదు. రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి అమలు చేయలేదు. ఇందిరమ్మ ఇళ్లను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే కేటాయించారు” అంటూ మండిపడ్డారు. గ్రామం అభివృద్ధి దిశగా ఇప్పటి వరకు పెద్దగా పనులు జరగలేదని, తామికి ఒక అవకాశం ఇస్తే పంచాయతీ అభివృద్ధి ఎలా ఉండాలో చూపిస్తానని ఉషరాణి వెల్లడించారు.
నామినేషన్ కార్యక్రమంలో CPI, CPM, BJP, TRS స్థానిక నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
కూటమి సర్పంచ్ అభ్యర్థిగా ముకరి ఉషరాణి నామినేషన్
RELATED ARTICLES



