TEJA NEWS TV TELANGANA : మెదక్ జిల్లా, చేగుంట మండలం పులిమామిడి గ్రామంలో సోమవారం నాడు చేగుంట మండల్ ఆర్ఐ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో, సివిల్ రైట్స్ అవగాహన సదస్సు పులిమామిడి గ్రామంలో ఎస్సీ కాలనీలో నిర్వహించారు. ఆర్ఐ సంతోష్ కుమార్, మరియు ఎస్సీ హాస్టల్ వార్డెన్ కొత్తపల్లి రమేష్ మాట్లాడుతూ ఎస్సీ వర్గానికి చెందిన కులస్తులను ఎవరైనా కులం పేరుతో దూషించిన దేవుని గుడిలోనికి రాకుండా అడ్డుపడిన వారి పైన ఎస్సీ, అట్రాస్టీట్ కేసు నమోదు చేసి జైలుకు పంపించడం జరుగుతుందన్నారు. గ్రామంలో ఎవరైనా కులాంతర వివాహం చేసుకున్నట్లయితే వారికి ప్రభుత్వం తరఫున 50 వేల రూపాయలు నగదు అందిస్తారు మరియు, పై చదువుల కొరకు విదేశాలకు వెళ్లాలంటే ఆర్థికస్తోమత లేకపోతే వారికి రెండు లక్షల రూపాయలు ప్రభుత్వ సహాయం అందజేయడం జరుగుతుంది, అని అన్నారు. ఈ కార్యక్రమంలో చేగుంట మండల్ ఆర్ఐ సంతోష్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, ఎస్సై బిక్య నాయక్, ఎస్సీ హాస్టల్ వార్డెన్ రమేష్, గ్రామ పంచాయతీ సెక్రెటరీ, ఎస్సి కులానికి చెందిన సభ్యులు పాల్గొన్నారు.
కుల దుహంకారణ, సమాజానికి సవాళ్లు – ఆర్ ఐ సంతోష్ కుమార్
RELATED ARTICLES