TEJANEWSTV TELANGANA : బీబీపేట్ మండల ఉపాధ్యక్షులు కందుకూరు స్వామి గౌడ్ గారి అన్న కూతురు వివాహం మల్కాపూర్ గ్రామంలో ఘనంగా జరిగింది. ఈ శుభకార్యానికి కామారెడ్డి శాసనసభ్యులు శ్రీ కాటిపల్లి వెంకటరమణ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ కుంట లక్ష్మారెడ్డి, జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి నక్క రవీందర్, బీబీపేట్ మండల అధ్యక్షులు అల్లం ప్రవీణ్ యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి పిడుగు శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్, బీజేవైఎం మండల అధ్యక్షులు చింతకుంట సంతోష్ రెడ్డి, మల్కాపూర్ గ్రామ అధ్యక్షులు నరేందర్ గౌడ్ తదితరులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా నాయకులు కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. వివాహ వేడుకకు స్థానిక ప్రజలు, బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై శుభాకార్యాన్ని మరింత వైభవంగా మార్చారు.
కామారెడ్డిలో శుభకార్యంకు హాజరైన ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి,బీజేపీ నాయకులు
RELATED ARTICLES



