భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
పాల్వంచ మండలం బసవతారక గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా జర్పుల కాశమ్మ నామినేషన్ దాఖలు చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,
*మంత్రిపొంగిలేటి ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బసవతారక గ్రామానికి సేవ చేయడానికి ముందుకు వచ్చాను” అని తెలిపారు.
గ్రామంలో గడపగడపకు తిరుగుతూ ప్రజల మద్దతును కోరుతున్న ఆమె, గ్రామ అభివృద్ధిపైనే ప్రధాన దృష్టి పెట్టనున్నట్లు చెప్పింది.
ప్రత్యేకంగా—
సీసీ రోడ్ల నిర్మాణం
డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల
పింఛన్ల పంపిణీలో పారదర్శకత
గ్రామానికి అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధి
వంటి కార్యక్రమాలను చేపడతానని హామీ ఇచ్చారు.
అభ్యర్థనగా,
“బ్యాట్ గుర్తుకు మీ విలువైన ఓటును వేసి నన్ను గెలిపించండి” అన్నారు.
కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా జర్పుల కాశమ్మ నామినేషన్
RELATED ARTICLES



