TEJA NEWS TV : కస్తూరీబా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థినిలకు బుక్స్, యూనిఫారమ్స్ అందజేసిన…ఎంపిపి
తేజ న్యూస్ టివి ప్రతినిధి సంగెం
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆదేశానుసారం సంగెం మండల కేంద్రంలోని కస్తూరిబా బాలికల పాఠశాలలోని
6వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్టునిలకు తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న నోట్ బుక్స్, టెక్స్ బుక్స్, యూనిఫారమ్స్ లను ఎంపీపీ కందగట్ల కళావతి విద్యార్థునిలకు అందచేశారు.
ఈ సందర్భంగా ఎంపీపీ కళావతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వము ఉచితంగా స్కూల్ పిల్లలకు ఉచితంగా నోట్ బుక్స్, స్కూల్ యూనిఫార్మ్స్ అందించటం జరిగింది అని అన్నారు, మీరు కష్టపడి , ఇష్టాంగా బాగా చదివి సమాజములో ఉన్నత స్థానంలో ఉండాలి అని అన్నారు.గత విద్యా సంవాశ్చారంలో 100 శాతం టెన్త్ క్లాస్ లో విద్యార్టునిలు పాస్ అయినoదుకు పాఠశాల ఉపాధ్యాయునిలను అభినందించారు,పాఠశాలలో ప్రభుత్వం అన్ని వసతులు కల్పించినది అని అన్నారు.ఈ ఇయర్ కూడ ఇష్టంతో చదివి 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల స్పెషల్ ఆఫీసర్ కె. నీలిమ,ఎంపీటీసీ సంగెం మెట్టిపల్లి మల్లయ్య, ఏపీఎం కిషన్, పాఠశాల ఉపాద్యాలునిలు, విద్యార్థులు పోల్గొన్నారు.