కర్నూలు జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన డా. ఏ. సిరిని ఆలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఇన్‌ఛార్జి శ్రీమతి వైకుంఠం జ్యోతి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదివారం కలెక్టరేట్‌లో ఆమె కలెక్టర్‌ను కలిసి, పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా వైకుంఠం జ్యోతి మాట్లాడుతూ, ఆలూరు నియోజకవర్గం అభివృద్ధికి జిల్లా కలెక్టర్‌గా డా. సిరి సహకారాలు ఎంతో అవసరమని కోరారు. ముఖ్యంగా నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు తమ వంతు సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.
అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ… జిల్లా అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వపరంగా మరియు కూటమి పార్టీల తరపున తమ పూర్తి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని, కలెక్టర్‌కు హామీ ఇచ్చారు. నూతన కలెక్టర్‌తో సౌజన్యపూర్వక భేటీలో నియోజకవర్గంలో చేపట్టాల్సిన ప్రధాన అభివృద్ధి అంశాలపై ఆమె చర్చించినట్లు తెలిపారు.
కర్నూలు జిల్లా కలెక్టర్‌ను కలిసిన ఆలూరు టీడీపీ ఇన్‌ఛార్జి వైకుంఠం జ్యోతి
RELATED ARTICLES



