తేజ న్యూస్ టివి ప్రతినిధి, సంగెం.
తెలంగాణ : వరంగల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సంగెం మండలం కుంటపల్లి గ్రామానికి చెందిన సతీష్ తన తల్లి వినోద(50)పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్ర గాయాలైన వినోదను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. సతీష్ పరారీలో ఉన్నట్లు తెలిసింది. ఆస్తి పంపకాల విషయంలో సతీష్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కన్నతల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కసాయి కొడుకు.
RELATED ARTICLES