కంచికచర్ల
తెలుగు సినిమా అగ్ర నటుడు పద్మ విభూషణ్ డాక్టర్ కొణిదెల చిరంజీవి పుట్టినరోజు వేడుకలు కంచికచర్ల జనసేన పార్టీ మండల అధ్యక్షుడు నాయిని సతీష్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక రంగా విగ్రహం వద్ద జాతీయ రహదారిపై అభిమానుల కోలాహలం నడుమ బాణాసంచా కాల్చి కేకులు కట్ చేసి అభిమానులకు పంచారు.అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చి సందడి చేశారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ చిరంజీవి అంటే తెలియని తెలుగు వారు ఉండరని తన నటన, డాన్స్, ఫైట్స్ తో యావత్ సినీ ప్రపంచాన్ని శాసించాడు అని పేర్కొన్నారు.కొన్ని కోట్ల మంది అభిమానుల హృదయాల్లో కళామతల్లి వరప్రసాదంగా చిరస్థాయిగా నిలిచిపోయారు అని అన్నారు. అని చేస్తున్న సేవా కార్యక్రమాలకు తన వంతు సహాయం అందిస్తూనే ఉన్నానని మునుముందు కూడా అదే పంథా అవలంబిస్తానని సతీష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు దేవి రెడ్డి శ్రీనివాసరావు, చిరంజీవి యువత పట్టణ అధ్యక్షుడు కొటారు దేవేంద్ర, పసుపులేటి శ్రీను, పసుపులేటి గోపి,రోజా రమణి, వనపర్తి పద్మారావు, పుప్పాల వేణుగోపాల్, బత్తుల కృష్ణ, కంభంపాటి తిరుమలరావు, కుసునూరు నరసింహారావు, మణి తదితరులు పాల్గొన్నారు.


