Wednesday, February 5, 2025

ఎస్పీ కార్యాలయంలో లొంగిపోయిన
సీపీఐ (మావోయిస్ట్) ఏరియా కమిటీ సభ్యురాలు (ACM)  పోడియం సోమిడి @ రోనీ

గత కొంతకాలంగా కాగర్ పేరిట జరుగుతున్న మావోయిస్టు హంట్ నేపద్యంలో మావోయిస్టులు సైతం జనజీవన స్రవంతిలో కలిసేందుకు భారీగా తరలివస్తున్నారు. నేడు మీడియం సోమిడీ అనే సెంట్రల్ కమిటీ మావోయిస్టు ఎటునాగారం పోలీసుల వద్ద లొంగి పోయారు. ఈ మేరకు పోలీసులు ఆమెను విచారించగా  విచారణలో విస్త్రపోయే నిజాలు బయటపడ్డాయి
పోడియం సోమిడి @ రోని D/o కోస, ఏరియా కమిటీ సభ్యురాలు (ACM) హోదా, 2వ సెంట్రల్ రీజినల్ కంపెనీ , CPI (మావోయిస్ట్) N/o పూజారి కా0కేర్
కుర్సం సమ్మయ్య @ సమ్మన్న N/o పెద్ద ఉట్లపల్లి, పూజారి కా0కేర్  RPC కమాండర్  ప్రోద్బలంతో, అతని మాటలకు ఆకర్షితురాలు  అయి, మావోయిస్ట్ పార్టీ భావజాలనికి లొను అయ్యి 2019    సంవత్సరంలో మిలీషియా లో  చేరింది. పూజారి కా0కేర్  RPC లో కుర్సం సమ్మయ్య @ సమ్మన్న దగ్గర ఆరు నెలలు పని చేసింది . ఈ కాలంలో ఆమె  12 బోర్ వేపన్  కలిగి ఉన్నది. అని ఏఎస్పీ వెల్లడించారు. అదే  సంవత్సరంలో దొడ్డి పోజ్జ @ ప్రకాష్ 2వ సెంట్రల్ రీజినల్ కంపెనీ  కమాండర్ ఆమెకు  పార్టీ సభ్యురాలుగా  పదోన్నతి కల్పించారని  మరియు 2వ సెంట్రల్ రీజినల్ కంపెనీకి బదిలీ చేయబడి, ఇక్కడ సాగర్ కి గార్డు గా ఒక  సంవత్సరం పని చేసి తరువాత 2వ సెంట్రల్ రీజినల్ కంపెనీ, 1 వ ప్లాటూన్, B-సెక్షన్ లో సభ్యురాలిగా చేరినట్టుగా వెల్లడించారు.. 2023, జూన్ నెలలో ఏరియా కమిటీ సభ్యురాలు (ACM) హోదా పొందిందని స్పష్టం చేశారు.ఈ సమయంలో ఆమె INSAS రైఫిల్‌ని మోయడం జరగింది అని ఈమె మీద (4) లక్షల నగదు రివార్డ్ కూడా ఉన్నట్లు ఏఎస్పీ తెలిపారు. అంతేకాకుండా ఆమె ఎన్ని హత్యలలో ఎన్ని ఎన్కౌంటర్లలో పాల్గొనిందో ఈ విధంగా తెలిపారు.

1. ఛత్తీస్‌గఢ్‌లోని కర్రెగుట్టలులో బేఛిరాకుమాడుగు ఎదురుకాల్పుల్లో పాల్గొన్నది. ఈ   ఎదురుకాల్పుల్లో ముగ్గురు మగ మావోయిస్టులు  మరణించారు.
2. ఛత్తీస్‌గఢ్‌లోని జగురగొండ, PS పరిది లో కుందేర్ గ్రామం అంబుష్ లో ముగ్గురు  – CRPF కానిస్టేబుల్ లను కాల్చి చంపిన ఘటనలో పాల్గొన్నది. 
3. ఛత్తీస్‌గఢ్‌లోని పెద్ద బట్టుం మరియు కవురగట్ట పోలీసు దాడిలో తప్పించుకున్న ఘటలలో ఉంది.
4. ఛత్తీస్‌గఢ్‌లోని ధర్మారం క్యాంపు దాడిలో పాల్గొన్నది. ఇందులో ముగ్గురు మగ మావోయిస్టులు  మరణించారు.
5. కర్రెగుట్టలు ప్రాంతంలో ఎన్నో బాంబులు అమర్చినట్టుగా స్పష్టం చేశారు.

లొంగిపోవడానికి కారణాలు :

1. మావోయిస్టుల భావజాలం పట్ల విరక్తి మరియు ప్రజల నుండి డబ్బులు వసూలు చేసి దోపిడీ సొమ్మును ముఖ్య  నేతలు  పంచుకుంటున్నారు. అని
2. విపరీతమైన పనిభారం, తిండిలో తక్కువ క్యాడర్‌ల పట్ల వివక్ష చూపడం మరియు వారిని విచక్షణారహితంగా కొట్టడం. లాంటివి మన్యంలో జరుగుతున్నాయి అన్నట్టుగా ఆమె వెల్లడించినట్టుగా ఎస్పీ తెలిపారు.
3.  ఛత్తీస్‌గఢ్‌లో పోలీసు క్యాంపులు రావడం మరియు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను తెలుసుకుని సాధారణ జీవితం గడపడానికి మావోయిస్టు పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్టు ఈ మేరకు ఆమె నా ఏటూర్ నాగారం స్టేషన్లో లొంగిపోవడం జరిగిందని  ఈ సందర్భంగా తెలిపారు. అంతేకాకుండా మీడియా ద్వారా పోలీసులకు మావోయిస్టు పార్టీకి చెందిన  నాయకులకు, మిలీషియా సభ్యులకు  సందేశాన్ని అందించాలని, అందరూ జన జీవన స్రవంతిలో చేరాలని తద్వారా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు మరియు కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే ప్రజల జీవితాల మెరుగు కోసం పోలీస్ అధికారులతోకలిసి పని చేయాలని వారు కోరారు. లొంగిపోయిన దళం సభ్యులకు అన్ని రాయితీలను సకాలంలో చెల్లించేలా తదుపరి చర్యలు తీసుకో అన్న బడుతాయని మీడియముకంగా తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular