Wednesday, February 5, 2025

ఎన్.టి.ఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న చిన్నహ్యట శేషగిరి

ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక వేడుకగా గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎన్.టి.ఆర్ భరోసా పెన్షన్ పంపిణీలో భాగంగా హొళగుంద మండల కేంద్రంలో పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న చిన్నహ్యట శేషగిరి గారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడ ఎన్నడూ లేనివిధంగా ప్రజాప్రగతి మరియు సంక్షేమంలో ప్రథమ స్థానంలో దూసుకుపోతున్న కూటమి ప్రభుత్వం, విప్లవాత్మకంగా ఎన్.టి.ఆర్ భరోసా పెన్షన్ల పేరిట ఏ రాష్ట్రంలో కూడా అందించని, కనివిని ఎరుగని స్థాయిలో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు 4000/- వికలాంగులకు 6000/- కిడ్నీ తదితర దీర్ఘకాలిక బాధితులకు  10 నుండి 15 వేల రూపాయలను ప్రతి నెల  ఒకటవ తేదీకెల్లా తూచా తప్పకుండా అందిస్తుందన్నారు.

సుదీర్ఘ అనుభవంతో సువర్ణపాలనను అందించుటకు సాయుధులై కృషిచేస్తున్న అధినాయకులు ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారు, యువ నాయకులు ఐటీ,విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సంయుక్త సారథ్యంలోని  కూటమి ప్రభుత్వపు ప్రజా శ్రేయస్సు పథకాల అమలులో తమకు కూడా భాగస్వామ్యం అయ్యే అవకాశం దొరకడం గర్వకారణం అన్నారు.

పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, తెలుగుదేశం యువ నాయకులు ఖాదర్ బాషా, కే.మల్లికార్జున మరియు పెన్షన్ దారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular