ఏనుమాముల మార్కెట్ లో ఏర్పాటు చేసిన వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉన్నందున లెక్కింపు కేంద్రంలో వివిధ పోలీస్ విభాగాల లకు చెందిన 400 మంది పోలీస్ అధికారులు సిబ్బందితో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు .
ఈ బందోబస్తు లో విధులు నిర్వహించే పోలీస్ అధికారులు, సిబ్బందితో వరంగల్ పోలీస్ కమిషనర్ ఏనుమాముల మార్కెట్ ప్రత్యేక సమావేశన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు కేంద్రానికి కేవలం ఎంపీ ఎన్నికల్లో పోటీదారులు, సంబంధిత ఏజెంట్లు, పాసులు ఉన్నవారికి మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. కౌంటింగ్ పూర్తి అయిన తర్వాత ఎటువంటి ర్యాలీలు, సభలకు అనుమతి లేదని ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా తెలియజేశారు. కౌంటింగ్ కేంద్రాల నందు మరియు బయట ప్రాంతంలో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కౌంటింగ్ కేంద్రాలలోనికి అనుమతులు ఉన్న వ్యక్తులను మాత్రమే అనుమతిస్తారని సాధారణ ప్రజలు కు అనుమతి లేదని సిపి తెలియజేశారు. అధికారులు తమకి అప్పగించిన విధులను సక్రమంగా నిర్వహించి ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతం ముగించాల్సిన బాధ్యత ప్రతి పోలీస్ అధికారిపై ఉందని.ముఖ్యం రేపు వరంగల్ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉన్నందున ఊరేగింపులు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని ఎవరైనా ఉత్తర్వులను అతిక్రమిస్తే చర్యలు తప్పవని పోలీస్ కమిషనర్ తెలిపారు. అంతకు ముందు ఓట్ల లెక్కింపు వేళ పోలీస్ అధికారులు నిర్వహించాల్సిన విధులను సంబంధిత అధికారులు విధులు నిర్వహించే పోలీస్ అధికారులకు వివరించారు.ఈ సమావేశంలో డీసీపీ లు రవీందర్, అబ్దుల్ బారీ, అదనపు డీసీపీ రవి తోపాటు ఏసీపీ లు, ఇన్స్ స్పెక్టర్లు, ఆర్. ఐ లు, ఎస్. ఐలు, ఇతర పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా చర్యలు
RELATED ARTICLES