నందిగామ మండలం పల్లగిరి సమీపంలో వేంచేసియున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయమునకు దిగువ (రెండవ పక్క) రహదారికి ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య నందిగామ పట్టణ కౌన్సిలర్లు మరియు ఎన్డీఏ నేతలతో కలిసి పనులకు శ్రీకారం చుట్టారు. శుక్రవారం కొబ్బరికాయ కొట్టి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని గాలికి వదిలేసి కొండలు, గుట్టలు, గట్లను వారి ఆదాయ వనరులుగా మార్చుకొని అడ్డంగా దోచేశారని విమర్శించారు. ప్రజాభీష్టమైన కూటమి ప్రభుత్వం జనరంజక పాలనను అందించడమే లక్ష్యంగా అడుగులు వేస్తుందని, గత ప్రభుత్వ అవినీతి మరకలన్నింటిని కూకటివేళ్ళతో సహా పెకలిస్తామని ఈ సందర్భంగా సౌమ్య తెలియజేశారు.
ఎన్డీఏ ప్రభుత్వంతో నే అభివృద్ధి సాధ్యం
RELATED ARTICLES