
TEJA NEWS TV
ములుగు జిల్లా ఎటునాగారం మండల కేంద్రంలోని
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాజనీతి శాస్త్రం విభాగం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డా,బి. రేణుక అధ్యక్షత వహించారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ మహాత్మా జ్యోతి రావు పూలే సమాజంలోని కులపరమైన వివక్షలను, అన్యాయాన్ని రూపుమాపడానికి తన జీవితాన్ని ధారపోసిన మహాత్ముడు అని, కొనియాడారు. ఇప్పుడు మనం చదువుకునే చదువులు ఆయన పెట్టిన బిక్ష అని ఈ మేరకు గుర్తు చేశారు. అనంతరం రాజనీతి శాస్త్ర విభాగ అధిపతి కె.రమేష్ మాట్లాడుతూ భారతదేశంలో ఉన్న కుల వ్యవస్థను నిర్మూలించడానికి మరియు బడుగు బలహీన వర్గాల విద్యావ్యాప్తికి జ్యోతిరావు పూలే ఎనలేని కృషి చేశారని విద్యార్థులకు తెలిపారు. ముందస్తుగా అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త సిహెచ్. వెంకటయ్య,ఇకక్ కోఆర్డినేటర్ డాక్టర్ పి. జ్యోతి, ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కన్వీనర్ కనీస్ ఫాతిమా, సంపత్, మున్ని, జీవవేణి, రాజశేఖర్, సుమలత, భావన, అభిలాష్, భాస్కర్ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.