TEJA NEWS TV : ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో ఆసక్తికరమైన పరిణామాలు
బిఆర్ఎస్ అంతమెుందించేందుకు అందర్నీ కలుపుకోకపోతే కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం
కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశంలో
ఎంపీపీ మేఘా రెడ్డి
తేజ న్యూస్ టివి ఆగస్టు 11); బిఆర్ఎస్ పాలనను అంతమెుందించేందుకు అందరూ కలిసి రావాలని వనపర్తి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు ఎంపీపీ మెగా రెడ్డి అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అవలంబించ వలసిన విధి విధానాలనుపై శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎన్నో సవాలను ఎదుర్కొందన్ని.. ఇప్పుడున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అందర్ని కలుపుకుంటూ ముందుకు సాగితే కాంగ్రెస్ పార్టీ అఖండ విజయాన్ని సొంతం చేసుకుంటుందన్నారు. ఉమ్మడి జిల్లాలో నేడు కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో ఇవాళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుందన్నారు. సీనియర్లు జూనియర్లను కలుపుకొనిపోతే కాంగ్రెస్ పార్టీకి తిరుగుండదని రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నట్లుగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎఐసీసి కార్యదర్శులు డాక్టర్ చిన్నారెడ్డి, టిపిసీసి ఉపాధ్యక్షులు డాక్టర్ మల్లు రవి, డాక్టర్ సంపత్ కుమార్, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీ కృష్ణ, టిపిసిసి సెక్రటరీ అభిలాశ్ రావ్, వనపర్తి డీసీసీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్,గద్వాల్ డిసిసి ప్రెసిడెంట్ పటేల్ ప్రభాకర్ రెడ్డి,గద్వాల్ నియోజకవర్గ నాయకులు తిరూపతయ్యా తదితరులు.
ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో ఆసక్తికరమైన పరిణామాలు – ఎంపిపి మేఘ రెడ్డి
RELATED ARTICLES



