ఒంటిమిట్ట మండల పరిధిలోని అన్ని యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఒంటిమిట్ట ఎంఆర్పి కార్యాలయము లో సోమవారం శిక్షణ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంటిమిట్ట ఎంఈఓ లు జి వెంకటసుబ్బయ్య, డి ప్రభాకర్ హాజరయ్యారు. వ్యాఖ్యాతగా మస్తాన్ బాబు వ్యవహరించారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేయబడుతున్న స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్, హ్యాబిటేషన్ ప్లాన్ లను కచ్చితత్వంగా నమోదు చేయాలన్నారు. స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్ పైననే ఆధారపడి పాఠశాలలకు మంజూరు కావలసిన వసతులు కానీ, నిధులు గాని అందుతాయన్నారు. ప్రతి ఒక్కరూ వారికి కేటాయించిన హాబిటేషన్ ప్లాన్లను నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాధవరం హెచ్ఎం నాగలక్ష్మి, రాచపల్లి హెచ్ఎం రత్నం, మండల పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయులకు శిక్షణ సమావేశము
RELATED ARTICLES