TEJA NEWS TV TELANGANA: మెదక్ జిల్లా, చేగుంట మండలం, చందాయి పేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఉపాధ్యాయురాలు కే అజిత (సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయురాలు) పదవీ విరమణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మెదక్ జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధా కిషన్. రాధా కిషన్ మాట్లాడుతూ ఉత్తమ ఉపాధ్యాయులకు సమాజంలో ఎప్పుడు గుర్తింపు ఉంటుందని, విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడే ఉపాధ్యాయులకు సమాజంలో మంచి గుర్తింపు ఉంటుందని, ఇన్ని సంవత్సరాలు ఉపాధ్యాయురాలుగా సేవలందించడమే కాకుండా, పిల్లలకు ఆర్థిక సాయం చేయడం కూడా చాలా సంతోషమని, విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తగ్గించడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర వహిస్తారని వారన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ కిషన్, మండల విద్యాధికారి నీరజ, నార్సింగి మండల విద్యాధికారి గంగుబాయి, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు అమర్ శేఖర్ రెడ్డి, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ సంతోష, వివిధ సంఘాల జిల్లా,మండల నాయకులు చల్లా లక్ష్మణ్, వెంకట్రాంరెడ్డి , రాజగోపాల్ గౌడ్, వరాల నర్సింలు, విట్టల్ రెడ్డి, రంగా రెడ్డి, జనార్దన్ రెడ్డి,రావుల వెంకటేష్, మనోహర్ రావు, పెంటా గౌడ్ కృష్ణమూర్తి, నరసింహ రావు, బాల పోచయ్య తిరుపతి రెడ్డి, చల్లా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఉత్తమ ఉపాధ్యాయులకు ఎప్పుడు గుర్తింపు ఉంటుంది – మెదక్ జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధా కిషన్
RELATED ARTICLES