భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
తేదీ: 17-11-2025
ఇల్లందు: ఇల్లందు పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవికి ఉద్యమ సీనియర్ నాయకుడు సిలివేరి సత్యనారాయణ నియమితులైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించబడిన ఇల్లందు బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించబడాయి.
ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే, ఇల్లందు నియోజకవర్గ ఇన్చార్జ్ హరిప్రియ నాయక్ హాజరై, సత్యనారాయణ కు నియామకపత్రం అందజేశారు. అనంతరం వారికి శాలువా కప్పి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
అలాగే నియోజకవర్గంలోని పలు మండలాల అధ్యక్షులు, మాజీ వార్డు కౌన్సిలర్లు, పట్టణ–మండల స్థాయి పార్టీ నాయకులు కూడా సిలివేరి సత్యనారాయణ శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.




