భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా – మణుగూరు మండలం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఇటుక బట్టీల యజమానులు ఇటుక ధరలను మూడింతలు పెంచడంతో, ఇళ్ల నిర్మాణ పనులు నిలిచిపోయాయి.
లబ్ధిదారులు తెలిపిన వివరాల ప్రకారం, ఒక ట్రాక్టర్ ఇటుకలకు రూ.18,000 వసూలు చేస్తూ, నాణ్యతలేని ఇటుకలు సరఫరా చేస్తున్నారని, సాధారణంగా ఒక ట్రాక్టర్‌లో 2000 ఇటుకలు ఉండాల్సిన చోట 1800–1900 మాత్రమే అందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం నిరుపేదల కోసం 5 లక్షల సహాయం అందిస్తుండగా, దానిని అడ్డంకిగా చూపిస్తూ ఇటుక యజమానులు రేట్లు పెంచడం అన్యాయం అని వారు పేర్కొన్నారు. “మేము ప్రభుత్వ సహాయంతో ఇళ్లు కట్టించుకుంటున్నాము. కానీ రేట్లు ఇలాగే పెరిగితే ఇళ్లు పూర్తి చేయడం అసాధ్యం అవుతుంది” అని లబ్ధిదారులు తెలిపారు.
లబ్ధిదారులు ఈ సమస్యపై తక్షణమే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మండల కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని హెచ్చరించారు.
ఈ సమస్యను రేపు స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్ల దృష్టికి, అలాగే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు లబ్ధిదారులు ప్రకటించారు.
ఇటుక రేట్లు పెరగడంతో మధ్యలో ఆగిపోయిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం – లబ్ధిదారుల ఆవేదన
RELATED ARTICLES



