TEJANEWSTV TELANGANA
సంగెం మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన బొంతు అఖిల్ ఆర్మీ ఉద్యోగానికి ఎంపిక కావడంతో సమాజ సేవకులు పులి రాజశేఖర్ శనివారం మన భారత దేశ యువ జవాన్ తల్లిదండ్రులు ను వారిని శాల్వతో సన్మానించారు. ఈ సందర్భంగా పులి రాజశేఖర్ మాట్లాడుతూ గ్రామాలలోని యువకులు ప్రభుత్వ పోటీ పరీక్షల్లో ప్రతిభను కనబరిచి ఉద్యోగాలకు ఎంపిక కావడం,మరి ఆర్మీ ఉద్యోగం అంటే దేశానికి సేవ చేయడమే అలాంటి ఆర్మీ ఉద్యోగాన్ని ఎంపిక చేసుకున్న అఖిల్ కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు… అలాగే గ్రామాలలో యువకులు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ లక్ష్యసాధనకు ప్రతి ఒక్కరూ కృషి యువకులు చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సంజయ్ కుమార్, సింధు, సంజయ్, మహేష్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ఇటీవల ఉద్యోగం పొందిన ఆర్మీ జవాన్ ను వారి తల్లిదండ్రులను శాలువతో సన్మానించిన గ్రామ సేవకులు పులి రాజశేఖర్
RELATED ARTICLES



