తేజ న్యూస్ టివి ప్రతినిధి. సంగెం.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీ ప్రకారం 18000 రూపాయల ఫిక్స్‌డ్ జీతాలు ఇవ్వాలని కోరుతూ కోఠి లోని డిఎంఈ కార్యాలయం ముందు ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు. వారిని అరెస్టు చేసే క్రమంలో మహిళా పోలీసులు ఉన్నా కానీ…మగ పోలీసులు ఆశా వర్కర్లను ఈడ్చుకుంటూ వెళ్తూ, అసభ్య పదజాలంతో బూతులు తిట్టారు, అలాగే ఆశా వర్కర్ల పై చేయి చేసుకుంటూ డీసీఎం లోకి ఎక్కించారు. ఈ సందర్భంగా *బిజెపి వరంగల్ కార్యదర్శి మొలుగూరి శ్రీనివాస్ (ఛౌకీధార్)* మాట్లాడుతూ ఆశా వర్కర్లపై పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించడం సరికాదన్నారు, తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ నాడే మహిళలపై విచక్షణ కోల్పోయి దాడి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ యంత్రాంగం మరియు సీఎం రేవంత్ రెడ్డి వెంటనే ఆశా వర్కర్లకు క్షమాపణ చెప్పాలని అన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఆశా వర్కర్లను రోడ్డున పడేస్తే, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నమ్మి వారిని గద్దెనెక్కిస్తే మళ్లీ ఈ ప్రభుత్వం కూడా బిఆర్ఎస్ తరహాలోనే పాలన సాగిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆశా వర్కర్లపై పోలీసుల ప్రవర్తన సరికాదు – మొలుగూరి శ్రీనివాస్
RELATED ARTICLES