TEJA NEWS TV
79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని, ఆళ్లగడ్డ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఆవరణంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు ముఖ్య అతిథిగా హాజరై, జెండా వందనం చేసి ఫ్లాగ్ ఆవిష్కరణ చేశారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొని దేశభక్తిని చాటారు. వేడుకలో పాటలు, సందేశాలు, జాతీయ గీతాల ద్వారా స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకున్నారు.



