ఆళ్లగడ్డ మున్సిపల్ కమిషనర్ గా కిషోర్ బుధవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ కమిషనర్ గా పని చేసిన జి వెంకటరామిరెడ్డి సెలవు పై వెళ్లడంతో గత 15 రోజులుగా రెగ్యులర్ కమిషనర్ లేరు. కిషోర్ గతంలో కూడా ఆళ్లగడ్డలో పని చేసిన అనుభవం ఉంది. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం తనపై ఉంచిన గురుతర బాధ్యతలు నెరవేరుస్తానని మున్సిపాలిటీ అభివృద్ధికి శాయ శక్తుల కృషి చేస్తామని తెలిపారు.
ఆళ్లగడ్డ మున్సిపల్ కమిషనర్ గా కిషోర్ బాధ్యతలు
RELATED ARTICLES