
TEJA NEWS TV:
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం మహానేత స్వర్గీయ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి 14 వ వర్ధంతి సందర్భంగా వైసీపీ నాయకులు రోగులకు పండ్లు బ్రెడ్ లను పంపిణీ చేశారు. ప్రసూతి వార్డులోని బాలింతలు గర్భవతులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ సీనియర్ నాయకుడు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కూలూరు నరసింహారెడ్డి మాట్లాడుతూ మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 14 వ వర్ధంతి వేడుకలను ప్రభుత్వ ఆసుపత్రిలో కొన్ని రోగుల నడుమ జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. పేద, బడుగు బలహీనవర్గాల ప్రజల గుండెల్లో మహానేత రాజశేఖరరెడ్డి చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో వైసిపి టౌన్ కన్వీనర్ గొట్లూరి సుధాకర్ రెడ్డి సీనియర్ వైసీపీ నాయకులు సునీల్ కుమార్ దామోదర్ రెడ్డి చంద్రారెడ్డి, ఆళ్లగడ్డ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తొమ్మండ్రు వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.