ఆళ్లగడ్డ మండలంలోని చింతకొమ్మదిన్నె గ్రామం వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పిట్టల సుధాకర్ అనే యువకుడు దుర్మరణం చెందారు. కడపకు చెందిన ముగ్గురు వ్యక్తులు మహానంది దర్శనం కోసం వెళ్లి తిరిగి కార్లో వస్తుండగా చింతకొమ్మదిన్నె సమీపంలో వారు ప్రయాణిస్తున్న కారు మోరీ ని ఢీకొనింది. ఈ ఘటనలో కారు డ్రైవ్ చేస్తున్న సుధాకర్ మరణించగా వెంకటేశ్వర్లు మనీష్ కుమార్, రాహుల్ అనే వ్యక్తులు గాయపడినట్లు సమాచారం తెలియగానే ఆలాగడ్డ డిఎస్పి ప్రమోద్ రూరల్ సీఐ మురళీధర్ రెడ్డి హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు గాయపడిన వారిని పత్రిక తరలించినట్లు రూరల్ సీఐ మురళీధర్ రెడ్డి తెలిపారు.

