
తేజ న్యూస్ టీవీ
రిపోర్టర్ పి శ్రీధర్
సెంటర్ ఆళ్లగడ్డ
ప్రారంభోత్సవానికి సిద్ధమైన ఆళ్లగడ్డ 50 పడకల ప్రభుత్వాసుపత్రి..
వైద్య సేవలు పరిశీలించిన అధికారుల బృందం
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో నూతనంగా అన్ని వసతులతో నిర్మించిన 50 పడకల ఆసుపత్రి ప్రారంభానికి సిద్ధమైంది. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఎక్స్రే ప్లాంట్ తో పాటు రోగులకు ఆధునిక వైద్య చికిత్సలను అందించేందుకు ప్రభుత్వం లక్షలాది రూపాయలు వేయంతో అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసింది. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రత్యేక చొరవతో 50 పడకల ఆసుపత్రిని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిధులు మంజూరు అయ్యాయి.
MLA భూమా అఖిలప్రియ సకాలంలో పనులను పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్లపై ఒత్తిడి తీసుకుని వచ్చి సకాలంలో పనులు పూర్తి చేయడంతో ప్రారంభోత్సవానికి సిద్ధమైంది..
వసతులను పరిశీలించిన వైద్య అధికారులు..
ఆళ్లగడ్డలోని 50 పడకల ప్రభుత్వాసుపత్రిలో నూతనంగా ఏర్పాటుచేసిన ఎక్స్రే ప్లాంట్ తదితర సదుపాయాలను ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ సుజాత, హెల్త్ ఆఫీసర్ దస్తగిరి రెడ్డి, వైద్యాధికారుల బృందం సోమవారం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చేతుల మీదగా రేపు ఆసుపత్రి భవనం ప్రారంభం చేస్తున్నట్లు వైద్య అధికారులు తెలిపారు.



