Tuesday, September 16, 2025

ఆళ్లగడ్డ :తెలుగు భాషా గౌరవం – క్రీడా విజేతలకు బహుమతులు | DSP ప్రమోద్ సందేశం

TEJA NEWS TV : నేడు తెలుగు భాష దినోత్సవం మరియు జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని ఆళ్లగడ్డ టౌన్ లోని వైపిపీఎం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు పి వీర రాఘవయ్య గారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా డి.ఎస్.పి కె ప్రమోద్ సార్ గారు అపుస్మా ఆళ్లగడ్డ నియోజవర్గం అధ్యక్షులు టి అమీర్ బాషా, ప్రధాన వక్త కే ప్రసాద్ సీనియర్ ఉపాధ్యాయులు శేష నయన రెడ్డి తెలుగు ఉపాధ్యాయులు శ్రీమతి టి నీరజ, టి వెంకట రమేష్, పి సూర్యనారాయణ రెడ్డి వ్యాయామ ఉపాధ్యాయురాలు శ్రీమతి కె రాణమ్మ, టీచర్ షరీఫ్ మరియు ఉపాధ్యాయ బృందం తెలుగు వ్యవహారిక భాష పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారి చిత్రపటానికి మరియు హాకీ క్రీడా మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ గారి చిత్రపటానికి పూలమాల అర్పించి వందనం వందనం తెలుగు తల్లికి వందనం, దేశ భాషలందు తెలుగు లెస్స, మాతృభాష తల్లిపాల వంటిది, పరాయి భాష డబ్బా పాల వంటిది  గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారికి జై హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ గారికి జై భారత్ మాతాకీ జై అంటూ నినాదాలతో తెలుగు భాష దినోత్సవం జాతీయ క్రీడా దినోత్సవం స్ఫూర్తిగా నిలిచారు ఈ సందర్భంగా తెలుగు భాష, వ్యాయామ భాష పండితులను సన్మానించారు క్రీడా రంగంలో విజేతలకు బహుమతి ప్రధానం చేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి డిఎస్పి కె ప్రమోద్ సార్ గారు సందేశాన్నిస్తూ నేటి పోటీ ప్రపంచంలో ఆంగ్ల భాష అవసరమే కానీ తెలుగు భాష మూలం అన్న విషయము మరవరాదు అన్నారు తెలుగు భాష వల్ల మన సంస్కృతిని కాపాడిన వారమవుతాము అన్నారు తెలుగు భాష కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది అన్నారు విద్యార్థులకు చదువులతోపాటు క్రీడలు చాలా అవసరం అన్నారు క్రీడల వలన విద్యార్థులలో నిబద్ధత, క్రమశిక్షణ, నాయకత్వం, దేశభక్తి ఆరోగ్యం స్నేహభావము కలుగుతుంది అన్నారు  గ్రాంధిక భాష నుండి వాడుక భాషలోనికి కృషి చేసిన గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారి జీవిత చరిత్ర ఆదర్శమన్నారు హాకీ క్రీడారంగంలో బంగారు పతకాలతో భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన మేజర్ ధ్యాన్ చంద్ గారి క్రీడా స్ఫూర్తి మార్గదర్శకం అన్నారు ఈ సందర్భంగా అమీర్ భాష మాట్లాడుతూ తెలుగు భాష మరవడం అమ్మను మరిచినట్లే తెలుపుతూ అపుస్మ యూనిట్ ద్వారా విద్యార్థులలో తెలుగు భాష కోసం సుమతి వేమన భాస్కర శతకాలతో పోటీలు నిర్వహిస్తామన్నారు ఈ సందర్భంగా వీరరాఘవయ్య మాట్లాడుతూ ఆళ్లగడ్డను చదువుల గడ్డతోపాటు క్రీడా రంగంలో కూడా జాతీయస్థాయిలో ఖ్యాతి నింపాలన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular