TEJA NEWS TV
ఆళ్లగడ్డ టౌన్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా ఈ. శ్రీనివాస గౌడ్ పదవి బాధ్యతలు చేపట్టారు. శనివారం ఆయన మాట్లాడుతూ అనంతపురం జిల్లా తాడిపత్రి నుండి పదోన్నతి పై నంద్యాల జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్సై గా రిపోర్ట్ చేయడం జరిగిందన్నారు. జిల్లా ఎస్పీ అది రాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు ఆళ్లగడ్డ టౌన్ ఎస్సై గా బాధ్యతలు చేపట్టినట్టు తెలిపారు. పట్టణంలో అసాంఘిక కార్యకలాపాల నివారణ, ట్రాఫిక్ పై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ప్రజలు ఏదైనా సమాచారం ఉంటే నేరుగా తమ దృష్టికి తీసుకొని రావాలని సూచించారు.
ఆళ్లగడ్డ టౌన్ నూతన ఎస్సై గా శ్రీనివాస గౌడ్
RELATED ARTICLES