Saturday, January 10, 2026

ఆళ్లగడ్డ :అధికారికంగా పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు

TEJANEWSTV : ఆళ్లగడ్డ పట్టణంలో సోమవారం అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించారు. మండల తహసిల్దార్ జ్యోతి రత్నకుమారి, ఎంపీడీవో నూర్జహాన్ ల ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ జ్యోతి రత్నకుమారి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు అమరజీవి వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కిషోర్, సానిటరీ ఇన్స్పెక్టర్ బాలస్వామి రెవెన్యూ, ఎంపీడీవో కార్యాలయాల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular