ఈనెల 24వ తేదీనకడపలో జరిగే బ్రాహ్మణసమ్మేళనం ఆహ్వాన పత్రికను గురువారం నాడు ఉదయం ఆళ్లగడ్డలో బ్రాహ్మణ చైతన్య వేదిక నంద్యాలజిల్లా అధ్యక్షులు కె.పి.వి.సుబ్బారావు,
ఆళ్లగడ్డ బ్రాహ్మణ సంక్షేమ సంఘం కార్యదర్శి ఎన్ .కృష్ణమూర్తి, సంఘము నాయకులు పద్మనాభ శర్మల చేతుల మీదుగా ఆవిష్కరణ చేశారు.ఈ సందర్భంగా బ్రాహ్మణ చైతన్య వేదిక నంద్యాల జిల్లా అధ్యక్షులుకె.పి.వి. సుబ్బారావు మీడియాతో మాట్లాడుతూ,.
బ్రాహ్మణ చైత్యన్య వేదికఆధ్వర్యములోఈ నెల 24 వ తేదీన కడప పట్టణము లోనిశ్రీ రాజ రాజేశ్వరీ దేవస్థానంలోబ్రాహ్మణ సమ్మేళనం జరుగుతుందని కడప ప్రజా ప్రతి నిధులు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని తెలిపారు. బ్రాహ్మణులు ఎదుర్కొనే సమస్యలపై విస్తృత చర్చ జరుపనున్నామని,అన్నీ విషయాలను ప్రభుత్వ దృష్టికితీసుకొని నాయకుల ద్వారాతీసుకోనున్నట్లు తెలియజేశారు. ఇప్పటికే ప్రభుత్వంధూపదీపారాధనకుహామీ మేరకు పెంచారని, వేదపండితులకు ఆర్థికసహకారం ఇచ్చారని పూజారుల వేతనాలు పెంచారని, మిగిలిన వర్గాలకు చెందిన బ్రాహ్మణుల సమస్యలు పరిష్కారం కోసం ప్రజా ప్రతినిధుల ద్వారా ప్రయత్నం చేయనున్నట్లు చెప్పారు.సూపర్ సిక్స్ లోనీహమీలను ప్రభుత్వం అమలు చేయడములో ప్రభుత్వచిత్తశుద్ధి ప్రశంస నియమన్నారు.అదే స్ఫూర్తితో ఇతర విషయాలు పరిష్కారం చేయమని అడుగ నున్నట్లుబ్రాహ్మణ చైతన్య వేదిక నంద్యాల జిల్లా అధ్యక్షులు కె.పి.వి.సుబ్బారావు పేర్కొన్నారు.అధిక సంఖ్యలో కడపలో జరిగే బ్రాహ్మణల సమ్మేళనంలోనంద్యాల జిల్లాలోని అన్నీ ప్రాంతాలనుంచి బ్రాహ్మణులు పెద్ద సంఖ్యలో పాల్గొనివిజయ వంతం చేయాలని కూడా నంద్యాల జిల్లా లోని బ్రాహ్మణ బంధువులకు అందరికీ ఆయన పిలుపు నిచ్చారు..
ఆళ్లగడ్డలో బ్రాహ్మణ సమ్మేళనం కరపత్రం విడుదల
RELATED ARTICLES