


TEJA NEWS TV : ఆళ్లగడ్డ పట్టణంలో సీఐ యుగంధర్ మరియు ఎస్సై నగీనా నేడు సిబ్బందితో కలిసి ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ఆచారి కాలనీ వరకు జరిగిన ఈ పట్రోలింగ్ సమయంలో ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
ఈ సందర్భంగా రోడ్డుకు ఇరువైపులా తోపుడు బండ్లు, ఆటోలు వంటి వాహనాలను అనుమతి లేకుండా నిలిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ప్రజలకు సైబర్ క్రైమ్ ప్రమాదాల గురించి అవగాహన కల్పిస్తూ, అపరిచిత లింకులు, ఫేక్ కాల్స్‌కి బలవకండని సూచనలు అందించారు.
పౌరులు ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసు శాఖకు సహకరించాలని వారు కోరారు.