




నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ…
ఆళ్లగడ్డ పట్టణంలోని శోభమ్మ కాలనీలో ఈరోజు సాయంత్రం నూతన సిసి రోడ్ల భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు…
ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి సంవత్సర కాలం అవుతుంది ఎన్నో అభివృద్ధి పనులు చేసినా కూడా ఈ వైసీపీ నాయకులు మాత్రం ఏమి చేశారంటూ మాట్లాడుతున్నారు కూటమి ప్రభుత్వం చేసిన పథకాలు మీకు కనిపించడం లేదా అంటూ ప్రశ్నించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు…
ఈరోజు రాష్ట్రాన్ని నాశనం చేసింది వైసిపి పార్టీ అభివృద్ధి చెందకుండా చేసింది వైసిపి పార్టీ రాష్ట్రాన్ని అప్పుల్లో పడేసి ప్రజలను ఇబ్బంది పెట్టింది వైసిపి పార్టీ అని చెప్పి నేను చెప్తున్నాను…
కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన హామీలు అన్నింటిని నెరవేరుస్తున్నారని వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసారు అని ఈరోజు కూటమి ప్రభుత్వం ఆ భారాన్ని మోస్తూ కూడా ప్రజలందరికీ పథకాలు అన్ని నెరవేరుస్తున్నారని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు తెలిపారు…
ఇచ్చిన మాట ప్రకారం ఆళ్లగడ్డ ను అభివృద్ధి బాటలో చేసి చూపిస్తానని ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఎక్కడ కూడా రోడ్లు ఇల్లు లేనివారికి కచ్చితంగా అన్ని ఇచ్చి అభివృద్ధి అంటే ఏంటో ఆళ్లగడ్డ నుంచి అమరావతి వరకు తెలిసేలాగా చేసి చూపిస్తాను అని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు తెలిపారు…