TEJA NEWS TV: బెల్దోన తెలుగుదేశం సర్పంచ్ భర్త మరియు కోట్ల ముఖ్య అనుచరుడు గోవింద్ మరియు తెలుగుదేశం పార్టీ మద్దతు దారులు,ఆ పార్టీని వీడి వైయస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకి చేరిక..*
*100 కుటుంబాలు తెలుగుదేశం పార్టీని వీడి వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరిక*
*పార్టీ కండువా వేసి సాధారంగా ఆహ్వానించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ గుమ్మనూరు జయరాం*
ఈ రోజు ఆలూరు పట్టణంలోని ఇబ్రహీం ఫంక్షన్ హాల్ నందు ఆలూరు మార్కెట్ యార్డు ఛైర్మన్ ప్రమాణస్వీకారం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ గుమ్మనూరు జయరాం గారి సమక్షంలో చిప్పగిరి మండలం,బెల్దోన తెలుగుదేశం పార్టీ గ్రామ సర్పంచ్ భర్త మరియు కోట్ల సుజాతమ్మ ముఖ్య అనుచరుడు గోవింద్ మరియు భూపాల్ వారి అనుచరులు మరియు 100కుటుంబాలు తెలుగుదేశం పార్టీమద్దతు దారులు వైస్సార్సీపీ పార్టీలో చేరిననారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ గుమ్మనూరు జయరాం గారు పార్టీ కండువా చేసి ఆయనను సాదరంగా ఆహ్వానించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తామని హామీ నిచ్చారు.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా మంత్రి గుమ్మనూరు తెలిపారు.ముఖ్యమంత్రి జగనన్న, మంత్రి గుమ్మనూరు జయరాం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు చేరిన వారు పేర్కొన్నారు..
ఈ కార్యక్రమంలో మంత్రి సోదరుడు గుమ్మనూరు శ్రీనివాసులు గారు, గుమ్మనూరు నారాయణ స్వామి గారు మరియు వైస్సార్సీపీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు..
ఆలూరు : 100 కుటుంబాలు తెలుగుదేశం పార్టీని వీడి వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరిక
RELATED ARTICLES