స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా విజయవాడలో ప్రారంభమైన స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం, ఆలూరు తాలూకాలో ఘనంగా ఆరంభమైంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలన్న NDA–TDP కూటమి ప్రభుత్వం “సూపర్ సిక్స్” హామీల్లో భాగంగా ఈ పథకం అమలు కానుంది.
ఆలూరు పట్టణంలో, ఆలూరు తాలూకా తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి బి. వీరభద్రగౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు రిబ్బన్ కట్ చేసి ఉచిత బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పి. తిక్కారెడ్డి, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ కప్పట్రాళ్ల బొజ్జమ్మ, రాష్ట్ర కార్యదర్శి వైకుంఠం జ్యోతి, BJP నాయకుడు వెంకటరాముడు, జనసేన ఐటీ కోఆర్డినేటర్ రంజిత్, స్పెషల్ ఆఫీసర్ చిరంజీవి, RTC మేనేజర్, MPDO తదితరులు హాజరయ్యారు.
కార్యక్రమానికి మండల కన్వీనర్లు, తాలూకా మరియు మండలాల వివిధ గ్రామాల నుండి వచ్చిన TDP కూటమి ప్రభుత్వ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, MPTC సభ్యులు, DC చైర్మన్లు, WUA ప్రెసిడెంట్లు, క్లస్టర్ మరియు యూనిట్ ఇన్చార్జులు, బూత్ ఇన్చార్జులు, తెలుగుయువత, ITDP, TNSF, TNTUC, CBN ఆర్మీ, TDP సోషల్ మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై విజయోత్సాహంతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఆలూరు తాలూకాలో విజయవంతంగా స్త్రీ శక్తి ఉచిత బస్సు కార్యక్రమం ప్రారంభం
RELATED ARTICLES