TEJA NEWS TV ( కర్నూలు జిల్లా )
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో RTO కార్యాలయం లో 34వ జాతీయ రహదారి భద్రత వారోత్సవాలను జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ వచ్చి అనేక విషయాలు తెలిపారు. ముఖ్యంగా వివిధ స్కూలు బస్సు డ్రైవర్లకు వాహనాలను నడిపేటప్పుడు . సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదు మద్యం సేవించి డ్రైవింగ్ చేయరాదు సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలి అనేక విషయాలను డ్రైవర్లకు సూచించడం జరిగింది. అనంతరం డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించి కంటి అద్దాలు కూడా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ఆర్టీవో శివారెడ్డి ఇండియన్ మిడికాల్ అసోసియేషన్ తరఫున డాక్టర్ పద్మ కుమార్, తదితరులు పాల్గొన్నారు